ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 94.88గా ఉండగా ఇందులో అమ్మాయిల శాతం 95.09గా ఉంది.బాలుర శాతం 94.68గా ఉందని ప్రకటించారు.ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా టెన్త్ ఫలితాలలో బాలికలదే పైచేయి అని ఆమె ప్రకటించారు.తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 98.19 శాతం ఉత్తీర్ణత రాగా అత్యల్పంగా నెల్లూరులో 83.19 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు ఆమె తెలిపారు.
మొత్తం 11వేల 690 స్కూళ్లకు గాను 5వేల 464 స్కూళ్లు 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె తెలిపారు.3 స్కూళ్లల్లో 0 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు ఆమె తెలిపారు.రీకౌంటింగ్,రీ వెరిఫికేషన్ కొరకు మే-30,2019 లోపల సబ్జెక్టు వారీగా రూ.500 ఫీజును చలానా లేదా ఆన్ లైన్ పేమెంట్ చెల్లించాలని ఆమె తెలిపారు.మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.అభ్యర్ధులు ఫలితాలను www. bseap.org, rtgs.ap.gov.in లో తెలుసుకోవచ్చు