Movie Tickets: సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్

సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు విషయంలో ఏ మాత్రం తగ్గేదే లేదు అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

High Court Of Andhra Pradesh Key Comments On Amaravati

Movie Tickets: సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు విషయంలో ఏ మాత్రం తగ్గేదే లేదు అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను హైకోర్టు సస్పెండ్ చేయగా.. సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌లో అప్పీల్ చేసింది కోర్టు. ప్రభుత్వం తరుపు వాదనలు వినాలని ఏజీ హైకోర్టును కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల నుంచి కోర్టు వాదనలు వింటోంది.

పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్లు అమ్మాలని ప్రభుత్వం పట్టుబడుతోంది.