ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతు పనులు షురూ

ఈ పనులను డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Prakasam Barrage

Prakasam Barrage: భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ప్రకాశం బ్యారేజ్‌ 67, 69 నంబర్‌ గేట్లకు నిపుణుల పర్యవేక్షణలో సిబ్బంది మరమ్మతు పనులు చేస్తున్నారు. బ్యారేజ్‌ 68, 69వ గేటు వద్ద పడవ ఢీకొని కొన్ని రోజుల క్రితం కౌంటర్‌ వెయిట్‌ డ్యామేజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ పనులను డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బెకెమ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరమ్మతు పనులు చేస్తోంది. పోలవరం గేట్లతో పాటు పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఏర్పాటు చేసింది బెకెమ్ ఇన్ ఫ్రానే. బ్యారేజీలో ఇరుక్కున్న నాలుగు పడవలను ఆ సంస్థ తొలగించనుంది.

మొదట 67, 69 గేట్లు మూసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్లు ఏర్పాటు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్నడూలేని విధంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: మా తరహాలో ఇలా బీజేపీ, మిగతా పార్టీల నాయకులు సాయం చేయడానికి ముందుకు రావాలి: హరీశ్ రావు

ట్రెండింగ్ వార్తలు