AP Rains: ఏపీకి తుఫాను ముప్పు.. బలపడుతున్న అల్పపీడనం.. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ (AP Rains)లో రాబోయే మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Ap weather alert heavy rains cyclone warning bay of bengal

AP Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు నుంచి మూడు రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో సంభవిస్తున్న వేగవంతమైన వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. తీరప్రాంత జిల్లాల్లో క్రమంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు విస్తరిస్తున్నాయి.

Deepika-Ranveer: దీపికా-రణ్‌వీర్ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం.. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. తుఫాను ముప్పు:

మరికొద్ది గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రంలో నూతనంగా అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు అంచనా వేశారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఈనెల 23 లేదా 24వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతరం ఇది మరింత బలపడి తుఫానుగా(AP Rains) మారి, ఉత్తర కోస్తా ఆంధ్ర – దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

హెచ్చరికలు జారీ.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం:

ఈ క్రమంలో రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంత వాసులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. రైతులు పంట రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, అత్యవసర సహాయక చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం ముందస్తుగా సమాయత్తం చేసింది.