APICET : ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఐసెట్, ఈసెట్ పరీక్ష (AP APICET, APECET results) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.

Apicet

APICET : ఏపీ ఐసెట్, ఈసెట్ పరీక్ష (AP APICET, APECET results) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఐసెట్, ఈసెట్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. అయితే ఈసెట్ పరీక్ష ఫలితాలలో 29, 904 మంది ఉత్తీర్ణులు అయ్యారు. అలాగే ఐసెట్ పరీక్షా ఫలితాలలో 34,789 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Read More : Jobs : ఏపీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్లు

ఈ రెంటు సెట్లలో ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదైంది. ఈసెట్ పరీక్ష ఫలితాలలో 92.53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అలాగే ఐసెట్ పరీక్షా ఫలితాలలో 91.27 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ఐసెట్‌లో అబ్బాయిలు సత్తా చాటారు. టాప్ 10లో ఎనిమిది మంది అబ్బాయిలు ర్యాంకులు సాధించారు. ఐసెట్ మొదటి ర్యాంకు శ్రీకాకుళం జిల్లా కాపు తెంబూరు గ్రమానికి చెందిన మాలపల్లి రామకృష్ణ సాధించినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండవ ర్యాంకు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన బండి లోకేష్, మూడవ ర్యాంకు విజయనగరం జిల్లా బుచ్చన్న పేటకు చెందిన తేనెల వెంకటేష్ సాధించారు.