Viveka Murder Approver Dastagiri : వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందన్నారు. సమాచారం ఉంటేనే ఎవరైనా విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.

Approver Dastagiri

Viveka Murder Approver Dastagiri : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందన్నారు. సమాచారం ఉంటేనే ఎవరైనా విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.కేసును హైదరాబాద్ కు బదిలీ చేయడం మంచిదేనని అన్నారు. హైదరాబాద్ కోర్టులో హాజరు విషయంలో సమన్లు తీసుకునేందుకు సీబీఐ కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

తాను ఇబ్బంది పడుతున్నట్లు విషయాలను అధికారులకు చెప్పిట్లు తెలిపారు. పది ప్రశ్నలకు సమాధానం దొరికి సమయం తొందరలోనే ఉందన్నారు. హైదరాబాద్ లో 10న జరుగనున్న సీబీఐ విచారణకు తప్పకుండా వెళ్తానని చెప్పారు. అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని తెలిపారు. ఎవిడెన్స్ లేనిది ఎవరిని పిలిచి విచారణ చేయరని, ఎంక్వైరీ చేయరని స్పష్టం చేశారు.

YS Sharmila : వివేకా హత్య కేసు విచారణపై స్పందించిన వైఎస్ షర్మిల

విచారణ చేసినంత మాత్రాన ఏమీ కాదన్నారు. తొందరలో నిజాలు బయటపడే అవకాశముందన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం కచ్చితంగా విచారణ జరిపితే పది రోజుల్లో తేలేదని.. కానీ అక్కడ జరగకపోవడంతో తెలంగాణలోని హైదరాబాద్ కు బదిలీ చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.