APPSC: ఏపీలో జూనియర్ లెక్చరర్ల జాబ్స్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జాబ్స్‌కు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. portal-psc.ap.gov.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారి సర్టిఫికెట్ పరిశీలన డిసెంబరు 16, 17 తేదీల్లో ఉంటుంది. కాల్ లెటర్లు రానివారు అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సర్టిఫికెట్ పరిశీలన కోసం అభ్యర్థులు విజయవాడలోని ఏపీపీఎస్సీ బిల్డింగ్ (సెకండ్ ఫ్లోర్, ఎంజీ రోడ్, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం)కు రావాల్సి ఉంటుంది. డిసెంబరు 16, 17 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. (APPSC)
వెబ్ సైట్ నుంచి చెక్ లిస్ట్ ఫాంను డౌన్‌లోడ్ చేసుకొని డీటెయిల్స్ నమోదు చేసుకోవాలి. ఒరిజినల్ ధ్రువపత్రాలను అటెస్టేషన్ చేసుకోవాలి. మెమోలు, 6వ తరగతి నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ తీసుకెళ్లాలి.
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి..