Site icon 10TV Telugu

APPSC సంచలన నిర్ణయం.. రిక్రూట్ మెంట్ ప్రాసెస్‌లో కీలక మార్పులు.. ఇక నుంచి..

APPSC Job Notification Releasing Soon

APPSC సంచలన నిర్ణయం తీసుకుంది. రిక్రూట్ మెంట్ ప్రాసెస్‌లో కీలక మార్పులు చేసింది. ఏపీపీఎస్ సీ స్కీనింగ్ టెస్ట్ నిర్వహణలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అభ్యర్థుల సంఖ్య 25వేలకు మించినప్పుడు స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీంతో అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండవు. మెజార్టీ నియామకాల్లో ఒకే పరీక్ష విధానమే అమలవనుంది. దీంతో నియామక ప్రక్రియ వేగం కానుంది.

ఏపీపీఎస్సీ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణలు చేసింది ప్రభుత్వం. నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు అనుసరిస్తున్న విధానంలో మార్పు చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలు మించినప్పుడల్లా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే విధానం రద్దు చేసింది. ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినపుడే ఇకపై స్ర్కీనింగ్ పరీక్ష ఉంటుంది. ఏపీపీఎస్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

కొత్త విధానంతో మెజారిటీ ఉద్యోగ నియామకాల్లో ఏక పరీక్ష విధానం అమల్లోకి రానుంది. వేగంగా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు రానుంది. ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా నియామకాలు చేపట్టనుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేసే అవకాశం ఉంది. నూతన విధానంతో నిరుద్యోగులకు కష్టాలు తప్పడంతో పాటు పలు ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్.

Also Read: బంపర్ ఆఫర్.. ఉచిత ట్రేనింగ్ జర్మనీలో ఉద్యోగం.. నెలకు రూ.2 లక్షల జీతం.. వెంటనే అప్లై చేసుకోండి

Exit mobile version