Pawan Kalyan : ఆర్టీసీ బస్సు ప్రమాదం.. విచారణ జరిపించాలన్న పవన్ కళ్యాణ్

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.

Pawan Kalyan

Pawan Kalyan : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం కలచి వేసిందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

Whole Grain Diet : చిరుధాన్యపు ఆహారంతో బరువు తగ్గొచ్చు తెలుసా?..

ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలచి వేసిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని పవన్ డిమాండ్ చేశారు. అలాగే, ప్రమాదంపై విచారణకు ఆదేశించాలని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

Cancer : క్యాన్సర్ దరిచేరకుండా కాపాడే ఆహారాలు ఇవే..

బస్సు ప్రమాద మృతుల్లో డ్రైవర్ తో పాటు ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.