APSRTC : ఆర్టీసీ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారయత్నం

ఓ మహిళ బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో నెల్లూరు నుంచి విజయవాడ వస్తోంది. ఈమెపై డ్రైవర్ కన్ను పడింది. సమయం చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. కామంతో కళ్లు...

APSRTC Driver

APSRTC Driver Attacked By Women in Vijayawada : మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా ఎక్కడో ఒకచోట దారుణాలకు పాల్పడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు చెలరేగిపోతున్నారు. కఠినంగా వ్యవహరిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంది. ఇలాంటి ఘటనే ఒకటి ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణీకురాలిపై డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దాదాపు రెండు గంటల పాటు ఆమెను హింసించాడు. ఈ దారుణ ఘటనను ఆర్టీసీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

Read More : AP Govt: నేడు పోలవరానికి కేంద్ర మంత్రితో కలిసి సీఎం జగన్

వివరాల్లోకి వెళితే…

ఓ మహిళ బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో నెల్లూరు నుంచి విజయవాడ వస్తోంది. ఈమెపై డ్రైవర్ కన్ను పడింది. సమయం చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. కామంతో కళ్లు మూసుకపోయిన ఆ డ్రైవర్ ను తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను హింసించాడు. రెండు గంటల పాటు పశువుగా ప్రవర్తించాడు. చివరకు తోటి ప్రయాణీకుడి సహాయంతో భర్తకు ఫోన్ చేసింది. వెంటనే భర్త అప్రమత్తమై.. తాను పని చేసే సంస్థకు సమాచారం అందించాడు. కారులో తన సిబ్బందితో బస్టాండుకు వచ్చి రక్షించాడు. డ్రైవర్ ను ఆర్టీసీ అధికారులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారా ? డ్రైవర్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలియరాలేదు.