అమలులోకి.. ఆర్టీసీ రిటైర్మెంట్ @60ఏళ్లు

ఆర్టీసీ కార్మికుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం మరో వరం ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనను ఇటీవలే ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అదే తరహాలో మరో గుడ్ న్యూస్ వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్‌ను 60ఏళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 

దీని గురించి ముందుగానే ప్రకటనలు చేసినప్పటికీ సోమవారం నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది. గతంలో 58ఏళ్లుగా ఉండే రిటైర్మెంట్‌ను మరో రెండేళ్లు పెంచారు. ఈ మేర సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల పదవీకాలాన్ని పెంచాలని ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. 

దసరా కానుకగా చేసిన ప్రకటనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంతో 53వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.