APSRTC: అంతర్‌రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఆంధప్రదేశ్ ఆర్టీసీ.. తెలంగాణ భూ భాగంలో కోల్పోయిన లక్ష కిలోమీటర్ల దూరాన్ని రాష్ట్రంలో పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న ఇంటర్నల్ రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే మొదలుపెట్టారు. అంతర్‌రాష్ట్ర సర్వీసుల్లో భాగంగా డిమాండ్ ఉన్న కర్ణాటక, తమిళనాడుకు సర్వీసులు పెంచనున్నారు.
ఇందులో భాగంగానే విజయవాడ–వైజాగ్ మధ్య ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేషన్స్‌పై సర్వే పూర్తి చేసిన అధికారులు ఈ మార్గంలో బస్సులు పెంచేందుకు ప్లాన్ రెడీ చేశారు. డిమాండ్ ఉన్న తిరుపతికి బస్సులు పెంచడంపై దృష్టి సారించారు. వైజాగ్–బెంగళూరు, వైజాగ్–చెన్నైలకు సర్వీసుల పెంపుపై అధ్యయనం చేయనున్నారు.
2 రోజుల నుంచి తెలంగాణకు 440 బస్సులు నడిపిన ఏపీఎస్‌ఆర్టీసీ వీటి సంఖ్యను క్రమంగా పెంచనుంది. నవంబరు రెండు నుంచి తెలంగాణకు ప్రారంభమైన బస్సుల్లో ఆక్యుపెన్సీ 80 శాతం వరకు ఉంది. విజయవాడ–హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ 45 సర్వీసులు నడిపితే, తెలంగాణ ఆర్టీసీ ఈ రూట్లో 39 సర్వీసులు నడిపింది.
మొత్తం కర్ణాటక, తెలంగాణ అంతర్‌రాష్ట్ర సర్వీసుల్లో ఆక్యుపెన్సీ 65 శాతం ఉంది. తమిళనాడుకు త్వరలో సర్వీసులు నడిపేందుకు తమిళనాడు ఆర్టీసీకి సమాచారం ఇచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. అక్కడి నుంచి ఆమోదం రాగానే చెన్నైకి ఏపీఎస్ఆర్టీసీ రైట్ అననుంది.
https://10tv.in/iphones-can-now-tell-blind-users-where-and-how-far-away-people-are/
విజయవాడ–వైజాగ్ 107 సర్వీసులు
* విజయవాడ–వైజాగ్ రూట్ మధ్య ఆర్టీసీ 107 సర్వీసులు నడుపుతూనే ఉంది. ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ 117 సర్వీసులు తిప్పుతున్నారు.
* ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు పగటిపూట సైతం బెజవాడ నుంచి వైజాగ్‌కు బస్సులు నడుపుతూనే ఉన్నారు.
* కాంట్రాక్టు క్యారేజీలకు అనుమతి తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్నారు. రూల్స్ బ్రేక్ చేసి ప్రైవేటు ట్రావెల్స్‌ను కట్టడిచేయాలని ఆర్టీసీ ఇప్పటికే రవాణాశాఖకు లేఖ రాసింది.
* బెజవాడ–తిరుపతి రూట్‌లో ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు గతంలో నిర్వహించిన విధంగానే తిరుమల దర్శనసేవలను పునరుద్ధరించనుంది.
* మిగిలిన ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీకే ప్రజాదరణ ఉంది.