Vijayawada Durga Temple: దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. వీఐపీ దర్శనాలు రద్దు
విజయవాడ కనకదుర్గమ్మ(Vijayawada Durga Temple) సన్నిధిలో ఆషాఢ మాస సారె ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- July 19, 2026 / 05:45 PM IST
Ashadha sare celebrations at Vijayawada Indrakeeladri temple
- ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తుల రద్దీ
- వీఐపీ దర్శనాలు పూర్తిగా రద్దు
- డిజిటల్ స్కానింగ్‌తో క్యూ పర్యవేక్షణ
Vijayawada Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాస సారె ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆషాఢ మాసం ఐదవ రోజుతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు, సారె సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు ఇంద్రకీలాద్రికి వెల్లువలా పోటెత్తడంతో ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ మార్గాలు భక్తజనసందోహంగా మారాయి.
Bahadurguda Land Issue: బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో ఉత్కంఠ.. 36 మందిపై కేసులు నమోదు
మధ్యాహ్నానికే దాదాపు 65 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని(Vijayawada Durga Temple) దర్శించుకోగా, వారిలో కేవలం ఆషాఢ సారె సమర్పించేందుకే 23 వేల మందికి పైగా భక్తులు విచ్చేశారు. ఈ భారీ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆలయ అధికారులు డిజిటల్ స్కానింగ్ సాంకేతికతను ఉపయోగించారు. కింద రిజిస్ట్రేషన్ కాగానే కొండపై ఉన్న స్కానింగ్ పాయింట్‌కు తక్షణ సమాచారం అందేలా చేసిన ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల నిరీక్షణ సమయాన్ని గణనీయంగా తగ్గించాయి.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలయ అధికారులు అంతరాలయ దర్శనాలతో పాటు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అన్ని రకాల టికెట్లను రద్దు చేసి ఉచిత దర్శనాలకు మాత్రమే అనుమతించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీరు అందించారు. ఆలయ ఈవో శీనా నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
