Bahadurguda Land Issue: బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో ఉత్కంఠ.. 36 మందిపై కేసులు నమోదు
శంషాబాద్ విమానాశ్రయ సమీపంలోని బహదూర్‌గూడ భూముల(Bahadurguda Land Issue) స్వాధీన ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Telangana police arrested 36 people in the Bahadurguda land issue
- బహదూర్‌గూడలో భూసేకరణ రచ్చ
- పోలీసులపై కారం చల్లిన ఆందోళనకారులు
- రాజకీయ నేతలపై కేసులు నమోదు
Bahadurguda Land Issue: శంషాబాద్ విమానాశ్రయ సమీపంలోని బహదూర్‌గూడ భూముల స్వాధీన ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుల్లెట్ రైలు, ఆర్టీసీ బస్సు ప్రాజెక్టుల కొరకు ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వ భూములను సేకరించాలని నిర్ణయించడంతో వివాదం రాజుకుంది. తరతరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న స్థానిక రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ఎనిమిది రోజులుగా ఆందోళనలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో రైతుల నిరసనలను అడ్డుకునేందుకు హైడ్రా అధికారులు శనివారం వేకువజామునే (Bahadurguda Land Issue)భారీ పోలీస్ బందోబస్తుతో రంగంలోకి దిగారు. అధికారులు దీక్షా శిబిరాన్ని తొలగించి, వివాదాస్పద భూములకు కంచె వేసేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన రైతులు, స్థానికులు అధికారులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ తోపులాటలో కొందరు ఆందోళనకారులు పోలీసులపై కారం చల్లడంతో పాటు కుర్చీలు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినందుకు గాను పోలీసులు స్థానిక రైతులు, మహిళలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. పటోళ్ల కార్తిక్ రెడ్డి, పంతంగి భూపాల్‌రెడ్డి, కోలన్ ప్రదీప్‌రెడ్డి సహా 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఉద్రిక్తతల మధ్యనే సుమారు 650 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.
