Cm Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావొద్దు.. నేతలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం ఏంటో తెలుసా?
కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం పైరవీలు చేసే నాయకులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
CM Revanth Reddy strong warning to party leaders in Zoom meeting.
- గాంధీభవన్‌కు రావొద్దని ఆదేశం
- క్షేత్రస్థాయిలోనే పర్యటనలు చేయాలి
- రాహుల్ గాంధీతో ఫొటో
Cm Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం పైరవీలు చేసే నాయకులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలను పక్కనబెట్టి హైదరాబాద్‌లోనే మకాం వేసే నేతలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో మాట్లాడిన సీఎం.. పదవులు ఆశించి గాంధీభవన్‌కు వచ్చే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వవద్దని స్పష్టం చేశారు.
Junk Food Ban: స్కూళ్ల దగ్గర జంక్ ఫుడ్ బ్యాన్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలు ఎవరూ గాంధీభవన్ వైపు రావద్దని, అందరూ తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘సర్’ (SIR) గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, రాబోయే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో పర్యటించాలని పిలుపునిచ్చారు. ఇన్‌ఛార్జి మంత్రులు జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలని, ఎంపీలు పార్లమెంట్లో ఉన్నప్పటికీ తమ ప్రాంతాలపై పర్యవేక్షణ ఉంచాలని, బాధ్యతారాహిత్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్వోల నివేదికలపైనే కాకుండా, పార్టీ బీఎల్ఏల రిపోర్టులపై ఆధారపడి పనిచేయాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం సమర్థంగా పనిచేసే 100 మంది ఉత్తమ బీఎల్ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో నేరుగా ఫొటో దిగే అరుదైన అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)ప్రకటించారు. ఈ నెల 30న మరోసారి పూర్తిస్థాయి సమీక్ష ఉంటుందని చెప్తూ.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఈ ప్రక్రియను మరింత సమర్థంగా సమన్వయం చేయాలని కోరారు.
