Junk Food Ban: స్కూళ్ల దగ్గర జంక్ ఫుడ్ బ్యాన్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
పాఠశాలల పరిసర ప్రాంతాలలో జంక్ ఫుడ్ (Junk Food Ban)విక్రయాలను పూర్తిగా నిషేధించాలని మంత్రి యూ.టీ. ఖాదర్ మంగళూరులో వెల్లడించారు.
Karnataka Govt has taken key decision to ban junk food in the vicinity of educational institutions
- పాఠశాలల్లో జంక్ ఫుడ్ నిషేధం
- ఆహార భద్రతా నిబంధనల్లో మార్పులు
- కొత్త ల్యాబొరేటరీల ఏర్పాటు నిర్ణయం
Junk Food Ban: పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంపొందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలు, వాటి పరిసర ప్రాంతాలలో జంక్ ఫుడ్ విక్రయాలను పూర్తిగా నిషేధించాలని యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూ.టీ. ఖాదర్ మంగళూరులో వెల్లడించారు. నేటి తరం పిల్లలు శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారానికి దూరమవుతున్నారనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.
Cm Ramesh: అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్య వరకు.. స్పెషల్ రైల్ ప్రారంభించిన ఎంపీ సీఎం రమేష్
జంక్ ఫుడ్పై నిషేధం, నిబంధనల్లో మార్పులు:
పాఠశాల విద్యార్థులకు పిజ్జాలు, బర్గర్లు వంటి అనారోగ్యకరమైన జంక్ ఫుడ్(Junk Food Ban) ఉత్పత్తులు అమ్మకుండా నిరోధించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. చిరుప్రాయంలోనే పిల్లలు అనేక ఆరోగ్య సమస్యల బారిన పడటానికి ఈ జంక్ ఫుడ్ సంస్కృతే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మెరుగైన ప్రమాణాలను నిర్ధారించడానికి ఆహార భద్రతా నిబంధనలలో పెద్ద ఎత్తున మార్పులను ప్రవేశపెడుతున్నామని, పిల్లల ఎదుగుదలకు పోషక విలువలున్న ఆహారం ఎంతో అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
ఆహార భద్రత మౌలిక వసతుల బలోపేతం:
ఈ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా మౌలిక వసతులను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆహార పరీక్షా ల్యాబొరేటరీలను ఆధునీకరించనున్నారు. అలాగే, టెస్టింగ్, మానిటరింగ్ సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నమూనాలో కొత్త ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఖాదర్ వివరించారు. ఈ నూతన విధానం అమలు, దాని ప్రభావంపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.
