Cm Ramesh: అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్య వరకు.. స్పెషల్ రైల్ ప్రారంభించిన ఎంపీ సీఎం రమేష్
అనకాపల్లి భక్తులకు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాల దర్శనభాగ్యం కల్పిస్తూ ఎంపీ సీఎం రమేష్ (Cm Ramesh)ప్రత్యేక రైలును ప్రారంభించారు.
MP CM Ramesh launched a special train from Anakapalle to Kashi and Ayodhya.
- అయోధ్య ప్రత్యేక రైలు ప్రారంభం
- 1500 మంది భక్తుల ప్రయాణం
- ఉచిత కాశీ, అయోధ్య దర్శనం
Cm Ramesh: అనకాపల్లి భక్తులకు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాల దర్శనభాగ్యం కల్పిస్తూ ఎంపీ సీఎం రమేష్ (Cm Ramesh)ప్రత్యేక రైలును ప్రారంభించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ఆయన జెండా ఊపి రైలును కదిలించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం ఈ ఉచిత ఆధ్యాత్మిక యాత్రను ఏర్పాటు చేసినట్లు ఎంపీ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు కేవలం అయోధ్య రామాలయమే కాకుండా, కాశీ విశ్వనాథుని దర్శనం కూడా ఈ యాత్రలో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Ahmedabad Tragedy: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి
ఈ ప్రత్యేక రైలు ప్రారంభోత్సవంతో రైల్వే స్టేషన్లో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. మొత్తం 20 బోగీలతో కూడిన ఈ ప్రత్యేక రైలులో సుమారు 1500 మంది భక్తులు కాశీ, అయోధ్యలకు బయలుదేరి వెళ్లారు. ఐదు రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ ప్రయాణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన, వసతి వంటి అన్ని రకాల సదుపాయాలను కల్పించినట్లు సీఎం రమేష్ తెలిపారు. నియోజకవర్గ ప్రజల నుంచి వస్తున్న స్పందన దృష్ట్యా త్వరలోనే మరికొన్ని ప్రాంతాల భక్తుల కోసం రెండో రైలును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనకాపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కేఎస్ఎన్ రాజు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, రైల్వే అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
