ఆశ్రమ నిర్వాహకుడిపై దాడి, హత్య

ashram organizer murder in chittoor district : చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుండ్ల పల్లిలో, ఓ ఆశ్రమ నిర్వాహకుడిని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. అచ్యుతానందగిరి (75) అనే వ్యక్తి గ్రామంలోని భగవాన్ శ్రీ రామతీర్ధం ఆశ్రమాన్ని కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నాడు.

జనవరి26, మంగళవారం రాత్రిగుర్తు తెలియని దుండగుడు ఆశ్రమంలోనికి ప్రవేశించి అచ్యుతానందగిరి పై దాడి చేశాఢు. దీంతో ఆయన కింద పడిపోయాడు. అనంతరం దుండగుడు ఆయన గొంతు నులిమి హత్య చేసినట్లు ఆయన సేవకురాలు లక్ష్మమ్మ పోలీసులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలానికి వచ్చి ఘటనపై ఆరా తీశారు.

చిత్తూరు నుంచి ప్రత్యేక క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.