Attack On CM Jagan : సీఎం జగన్‌పై దాడి.. వైఎస్ షర్మిల, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

Attack On CM Jagan : విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ పై దాడి ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీఎం జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి స్పందించారు. జగన్ పై దాడిని ఆమె ఖండించారు. జగన్ పై దాడి దురదృష్టకరం అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు.

”ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు కచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.”

 

జాగ్రత్త జగన్ అన్న- కేటీఆర్
అటు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సీఎం జగన్ పై దాడి ఘటనపై స్పందించారు. జాగ్రత్త జగన్ అన్న అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ”మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్న. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు కేటీఆర్.

 

 

Also Read : ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి.. కనుబొమ్మపై గాయం

 

ట్రెండింగ్ వార్తలు