Karnati Rambabu : దుర్గ గుడి ఛైర్మన్‌పై హత్యాయత్నం

Attack On Karnati Rambabu : దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే ఛైర్మన్ రాంబాబుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు సీపీ.

Attack On Durga Temple Chairman Karnati Rambabu

విజయవాడలో కలకలం రేగింది. దుర్గ గుడి ఛైర్మన్ పై హత్యాయత్నం జరిగింది. కర్నాటి రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. గాజు సీసాతో పొడిచాడు. ఈ దాడిలో రాంబాబుకు కడుపులో గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు బంధువులు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : ఎంపీ రఘురామ పిటీషన్.. సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి ఇటీవలే మరణించారు. దీంతో స్మశానంలోని తండ్రి సమాధి వద్ద దీపం పెట్టడానికి రాంబాబు వెళ్లారు. దీపం పెట్టి కాళ్లు కడుక్కుంటున్న సమయంలో వెనుక నుండి వచ్చిన వ్యక్తి సీసాతో దాడి చేశాడు. దాడిని పసిగట్టిన రాంబాబు పక్కకి తప్పించుకోవడంతో గాజుసీసా కడుపులో గుచ్చుకుంది. దాడి చేసిన వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే ఛైర్మన్ రాంబాబుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు సీపీ.

అతడు ఎవరో, ఎందుకు దాడి చేశాడో నాకు తెలీదు-కర్నాటి రాంబాబు
దాడి ఘటనపై కర్నాటి రాంబాబు స్పందించారు. ”ఒక వ్యక్తి సడెన్ గా వచ్చాడు. గాజు సీసా పగలకొట్టి దాంతో అటాక్ చేశాడు. నేను తిరిగే చూసేసరికి దాడి చేశాడు. రెండోసారి కూడా కూడా దాడి చేయబోతే వెంటనే పక్కకు జరిగా. దాంతో అతడు పడిపోయాడు. మళ్లీ లేచి వచ్చి దాడికి యత్నించాడు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న వాళ్లు వచ్చి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలీదు? ఎందుకు నాపై దాడి చేశాడో కూడా తెలియడం లేదు. బూతులు తిడుతూ సడెన్ గా అటాక్ చేశాడు. నేను ఎప్పుడూ అతడితో మాట్లాడలేదు. అతడు కాటికాపరి కూడా కాడు. అతడు మద్యం మత్తులో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు” అని కర్నాటి రాంబాబు చెప్పారు.

Also Read : కేంద్రం ఇచ్చిన ఆ కోట్ల రూపాయలు ఏమయ్యాయి? సీఎం జగన్‌ను ప్రశ్నించిన పురంధేశ్వరి

దుర్గగుడి ఛైర్మన్ రాంబాబుపై దాడి ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రాంబాబు కుటుంబసభ్యులను భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగింది? అనేది పోలీసులు విచారిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరు? ఎందుకు కర్నాటి రాంబాబుపై దాడి చేశాడు? ఈ మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు