Guntur : ప్రేమజంటపై అఘాయిత్యం

Guntur

Guntur : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం రాత్రి సమయంలో పుష్కరఘాట్‌లోని ఇసుకలో ప్రేమ జంట కూర్చొని ఉండగా వారిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు.

యువకుడిని తాళ్లతో కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పడవలో విజయవాడ వైపుకు పారిపోయారు. ఘటనపై ఆదివారం తెల్లవారు జామున తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీంతో అత్యాచారానికి గురైన యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అధికారులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.