Audimulapu Suresh
Audimulapu Suresh: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జగన్ నేరుగా నడుం బిగించారని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అందులో భాగంగానే జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహితపాలన అనేది ఒక మంత్రంగా జగన్ పాలన సాగించారని అన్నారు.
పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధిలో వికేంద్రీకరణ ద్వారా పథకాలు, సేవలు మరింతగా ప్రజలకు అందించేందుకు ఉపయోగపడుతున్నాయని ఆదిమూలపు సురేశ్ చెప్పారు. అందిన సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజాసమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.
ప్రజలు సంతృప్తి చెందకపోతే ఇంకా ఏమిచేయాలనేదానిపై సమీక్ష నిర్వహిస్తారని ఆదిమూలపు సురేశ్ తెలిపారు. కుల ధ్రువీకరణ నుంచి అన్ని సమస్యలకు కూడా జగన్నకు చెబుదాం ద్వారా పరిష్కారం అయ్యేలా చేయబోతున్నామని చెప్పారు. స్పందనలో ఇచ్చిన సమస్య పరిష్కారం కాకపోతే కూడా వాటిని ఈ కార్యక్రమం ద్వారా సత్వరమే శాశ్వత పరిష్కారం చూపబోతున్నామని తెలిపారు.
వెలుగొండ ప్రాజెక్ట్ పరిధిలోని గిద్దలూరు మార్కాపురం యర్రగొండపాలెం ప్రాంతాలలో ఇంటింటికి కొలాయి ఏర్పాటు చేసేందుకు త్వరలోనే టెండర్లను పిలవబోతున్నామని ఆదిమూలపు సురేశ్ అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు 25వేల బోర్లను వేశామని చెప్పారు.
ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రకాశం జిల్లా పంటల పరిశీలన ప్రత్యేకాధికారి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల ధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామని చెప్పారు.
వాటిల్లో ఎంత మేర దెబ్బతిన్నదనేదానిపై సీఎం పేషీలోని అడిటింగ్ టీం గ్రౌండ్ లెవెల్లో పంటలను పరిశీలించి వాటి ఆధారంగా నష్టపరిహారం ఎంత అనేది ఫైనల్ గా నిర్ణయిస్తారని అన్నారు. ర్యాండం చెకప్ ఆధారంగా నిబంధనలకు అనుగుణంగా ఎంత మేరకు రైతుకు న్యాయం చేయగలమో అంతే చేయగలమని స్పష్టం చేశారు.
Pawan Kalyan : రేపు రాజమండ్రికి పవన్ కల్యాణ్ .. రైతన్నలకు పరామర్శ, పోలవరం ప్రాజెక్టు సందర్శన