Auto Mini Garden: ఆటోలో మినీ గార్డెన్… పచ్చదనం అంటే ఆటోవాలాకు ప్రాణం…

ఇంటి పెరట్లోను.. మిద్దెలపైన మొక్కలు పెంచటం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటో రిక్షాను హరితవనంగా మార్చాడు. ఆటోలో ఎక్కే ప్రయాణికులకు ఇది ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

Auto Mini Garden : ఇంటి పెరట్లోను.. మిద్దెలపైన మొక్కలు పెంచటం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటో రిక్షాను హరితవనంగా మార్చాడు. ఆటోలో ఎక్కే ప్రయాణికులకు ఇది ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన సీహెచ్‌ జక్రయ్య. మొక్కల పెంపకానికి అనువైన స్థలం లేకపోవడంతో జక్రయ్య తన ఆటోలోని ముందు భాగంలో ప్రత్యేకంగా ట్రే ఏర్పాటు చేసుకున్నాడు.

అందులో మొక్కలు పెంచేందుకు అనువుగా మట్టి, రాళ్లు వేసి గార్డెన్‌లా తయారు చేశాడు. మొక్కలకు పోసే నీరు కిందికి వెళ్లేలా ఓ పైపును అమర్చాడు. చిన్నప్పటి నుంచి తనకు మొక్కలంటే ప్రాణమని జక్రయ చెబుతున్నాడు…పచ్చదనం పెంపుకు తను చేస్తున్న చిన్న ప్రయత్నం ఆదర్శంగా ఉంటే అంతకంటే తనకి ఏమికావాలని అంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు