మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ – కొడాలి నాని

  • Publish Date - November 2, 2020 / 01:01 PM IST

BC Corporation Abhinandana Sabha : మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ ఉంటారని ఏపీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఆయన ఫైర్ అయ్యారు. బీసీలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, బీసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలిపారు. నూతనంగా నియమితులైన బి.సి కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఇతరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ…



బీసీల పాలిట ఆశాజ్యోతిగా జగన్ మారారన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కంటే మెరుగ్గా జగన్ బీసీలకు న్యాయం చేస్తున్నారని, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా..ప్రజలు నమ్మరన్నారు. రాజశేఖరరెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో బీసీలకు, ఇతర వర్గాల కుటుంబాలకు మేలు చేశారని, బీసీలకు నేనున్నాను అనే భరోసా ఇచ్చారని కొనియాడారు. ఎన్టీరామారావు లేని లోటును ఆయన తీర్చారని, మహానుభావుడన్నారు.



రాష్ట్ర ప్రజల గుండెల్లో మరణం లేని వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచారన్నారు. రాజశేఖరరెడ్డి ఇంకా ఉంటే..మరింత మేలైన పాలన సాగేదన్నారు. ఈ క్రమంలో..కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చి..ప్రజల ముందు నిలబడరన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా, సీఎంగా ప్రజలు తీసుకొచ్చారని, అమ్మ ఒడి పథకం ద్వార పేద తల్లులకు ఎంతో సహాయం చేస్తున్నారన్నారు.



నాడు – నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా..ప్రభుత్వ స్కూళ్లను తయారు చేశారన్నారు. నాడు తండ్రి చదివిస్తే..నేడు జగన్ ఉద్యోగాలు ఇస్తున్నారని, సమాజంలో బలహీనవర్గాలను పైకి తీసుకరావాలని, రాజకీయంగా చైతన్యవంతంగా తయారు చేయాలని చిత్తశుద్ధితో పని చేసిన వ్యక్తులు ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, మహాత్మ పూలే..అన్నారు.



అవాకులు, చెవాకులు పేలుతున్న వ్యక్తులు జగన్ చేస్తున్న కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని తెలిపారు. పరిపాలన జరగకుండా చూస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి కొడాలి నాని.

ట్రెండింగ్ వార్తలు