×
Ad

Srikakulam : పేషెంట్ ను తీసుకరావడానికి వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకున్న ఎలుగుబంటి

చాలా సేపటి తర్వాత ఎలుగుబంటి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లడంతో అంబులెన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.

  • Published On : June 25, 2023 / 07:36 AM IST

Bear

Bear Blocked Ambulance : శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలంలో ఓ ఎలుగుబంటి అంబులెన్స్ ను అడ్డగించింది. రట్టి గ్రామంలో ఓ పేషెంట్ ను తీసుకరావడానికి ఉదయాన్నే వెళ్లిన అంబులెన్స్ ను మార్గంమధ్యలో ఎలుగుబంటి అడ్డగించింది. అంబులెన్స్ వెళ్లడానికి దారి ఇవ్వకుండా చుక్కలు చూపించింది.

Hong Kong Flight : పేలిన హాంకాంగ్ విమానం టైరు..11 మంది ప్రయాణికులకు గాయాలు

చాలా సేపటి తర్వాత ఎలుగుబంటి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లడంతో అంబులెన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. రాత్రి, ఉదయం వేళల్లో రోడ్లపై ఎలుగుబంట్లు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు దృష్టి సారించి ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.