Beatuy Snow fall in Andhra Kashmir LambaSingi : మంచు అందాలను చూడాలనుకుంటే ఎక్కడో కశ్మీర్ వరకు వెళ్లనక్కర్లేదు.. మన లంబసింగిలోనే ఆ మంచు అందాలను ఆశ్వాధించవచ్చు. ఆంధ్రా కాశ్మీర్‌గా లంబసింగి పేరొంది. విశాఖ జిల్లాలోని చింతపల్లికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగి పర్యాటక ప్రాంతంలో పేరుగాంచింది.
శీతాకాలం వస్తేచాలు.. మంచు దుప్పటి పరిచేలా లంబసింగి అందాలతో అలరిస్తుంటుంది. ప్రత్యేకించి మంచి కురిసేవేళలో పర్యాటకులు ఎక్కువమంది ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మంచు అందాలను చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది.
ఉదయం పది దాటినా సూర్యుడు కనిపించడు. మధ్యాహ్నం వరకు అలానే ఉంటుంది. డిసెంబర్, జనవరిలో ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు మధ్యాహ్నానికే సెవు అంటాడు. డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. మంచు కొరికే చలి తీవ్రంగా ఉంటుంది. ఇక లంబసింగికి 27 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి జలపాతం అందాలు పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉంటాయి.
పచ్చదనం పరచుకునే లంబసింగి ప్రదేశంలో పక్షుల కిలకిలరావాలు ప్రకృతి ప్రేమికులను మరింత కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు కూలెస్ట్ విలేజ్ లంబసింగికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల సందడితో లంబసింగి ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.