Cji Nv Ramana
CJI Ramana: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు బెజవాడ బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది. గుంటుపల్లిలోని సి అండ్ ఏ హాలులో జరిగిన కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ వినిత్ శరన్, జితేంద్ర కుమార్ మహేశ్వరి, పీయస్ నరసింహా, హైకోర్టు న్యాయమూర్తులు ఏపీ సిజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, టియస్ సిజే సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, వినీల్ చరణ్, పి.యస్. నరసింహలు హాజరయ్యారు.
‘కోకా సుబ్బారావు గారి తరువాత అరవై సంవత్సరాలకు తెలుగువాడైన ఎన్వీ రమణ ఛీఫ్ జస్టిస్ అయ్యారు. ఎన్వీ రమణ ఒకేసారి తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జిలను అపాయింట్ చేయగలిగారు. వేకెంట్‌గా ఉన్న హైకోర్టు జడ్జి పదవుల్లో వంద మందిని ఒకేసారి ఎన్వీ రమణ మాత్రమే నియామాకం చేయగలిగారు’
rEAD aLSO: తెలుగు వ్యక్తి విఠలాచార్యపై ప్రధాని మోదీ ప్రశంసలు
‘కక్షిదారులకు న్యాయం త్వరగా జరగాలంటే జడ్జిల నియామకం త్వరగా జరపాలనేది ఎన్వీ రమణ ఉద్దేశ్యం. న్యాయ వ్యవస్ధను మార్చడానికి కృషి చేస్తున్న ఎన్వీ రమణకు ఈ సన్మానం సముచితమైనది’ అంటూ ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణను కొనియాడారు జస్టిస్ లావు నాగేశ్వరరావు.
ఎన్వీ రమణ స్వంత స్ధలానికి ఆయనతో రావడం ఆనందదాయకం. కలిసి పనిచేయడం చాలా సంతోషకరం. ఎన్వీ రమణ నిర్ణయాలు చాలా ఆమోదయోగ్యంగా ఉంటాయి.
– జస్టిస్ వినీత్ శరణ్
1988లో లాయర్‌గా వచ్చా. ఆంధ్ర బార్ అసోసియేషన్ నుంచి అప్పట్లో అవకాశం వచ్చింది. సుప్రీంకోర్టు లో నిల్చొనే అవకాశం కల్పించింది. ఇంత దక్షతగా పనిచేసిన వ్యక్తి ఎన్వీ రమణ మాత్రమే.
జస్టిస్ పి.ఎస్.నరసింహ
సీజేఐ ఎన్వీ రమణకు కావలికి చెందిన మణి మాస్టారు తెలుగులో శుభాశీస్సులు అందించారు. ప్రాసతో ఆకట్టుకున్న మణిమాస్టారును సీజేఐ ఎన్వీ రమణ సన్మానించారు.