grandhi srinivas pawan kalyan
YCP MLA Grandhi Srinivas : భీమవరం (Bhimavaram)వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (ycp mla grandhi srinivas)మరోసారి పవన్ కల్యాణ్ (pawan kalyan )పై విమర్శలు చేశారు. పవన్ కు వ్యక్తిత్వం లేదని..విశ్వసనీయత లేని వ్యక్తి పవన్ అంటూ విమర్శించారు. 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో జనసేనకు విముక్తి పలికారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు(chandrababu naidu) ని బ్లాక్ మెయిల్ చేయడానికే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర (varahi yatra)చేపట్టారు అంటూ ఆరోపించారు.
గోదావరి జిల్లాలో రౌడియిజం,గుండాయిజం చేసేది..ఎవరో ప్రజలకు తెలుసని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. గతంలో హిరో రాజశేఖర్,జీవితలపై రౌడియిజం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ ఎద్దేవా చేశారు.రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ (Janaseana Party)పెట్టారని విమర్శించారు.175 నియోజకవర్గాలలో ఫోటి చేయలేని జనసేన గురించి పట్టించుకోనవసరం లేదంటూ తీసిపారేశారు. ప్రజలు జనసేన పార్టీని పవన్ ను నమ్మటంలేదన్నారు.
Pawan Kalyan : ఒక్క చోట కూడా వైసీపీని గెలవనివ్వను, ఏపీని నెంబర్ 1 చేస్తా- పవన్ కల్యాణ్
గతంలో భీమవరం (Bhimavaram)నుండి పోటి చేసి ఓడిపోయి తరువాత నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకోలేదని అటువంటి పవన్ మరోసారి వస్తే ప్రజలు నమ్మరని అన్నారు గ్రంథి శ్రీనివాస్.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వారాహి’ యాత్ర మొదలైనప్పటినుంచి వైసీపీ ప్రభుత్వం (YCP Govt)పైనా..నేతలపై విమర్శలాస్త్రాలు సంధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో పవన్ వైసీపీ నేతలపైనా సీఎం జగన్ పైనా ఘాటు విమర్శలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి వైసీపీ అభ్యర్థిని ఒక్కరిని కూడా గెలవనివ్వను అంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు తన ప్రసంగాల్లో.
మరోవైపు వైసీపీ నేతల కూడా పవన్ కు స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం గ్రంథి శ్రీనివాస్ పవన్ పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తు..పవన్ కల్యాణ్‌ను ఎల్‌కేజీలో చేర్పించాలని… ఎల్‌కేజీ చదవడానికి మూడేళ్ల వయసు కావాలి..కానీ పవన్ కు 55 ఏళ్లు. అందుకే పవన్‌ను ఎల్‌కేజీలో చేర్పించటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అనుమతి కోరతాను అంటూ ఎద్దేవా చేసారు.
MLA Grandhi srinivas : సత్యదేవుని సాక్షిగా పవన్ పచ్చి అబద్దాలాడుతున్నారు : వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి