Tirupati: శ్రీ గోవింద రాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. రథం కాలిపోయిందన్న ప్రచారంపై భూమన, టీటీడీ ఈవో స్పందన 

టీడీపీ నేతలు మాత్రం ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు.

Govindaraja Swamy temple Tirupati

Tirupati – Bhumana Karunakar Reddy: తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి ఆలయం (Govindaraja Swamy temple ) వద్ద లావణ్య ఫ్రేమ్స్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడు ఫైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అక్కడకు చేరుకుని పరిస్థితులను పరిశీలించారు.

అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… సిబ్బంది సకాలంలో చేరుకుని మంటల్ని అదుపు చేశారని తెలిపారు.
టీడీపీ నేతలు మాత్రం ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. ఆలయ రథం కాలిపోయిందని అసత్యం ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రథానికి లావణ్య ఫ్రేమ్స్ దుకాణం చాలా దూరంలో ఉంటుందని తెలిపారు. తాము మాత్రం దీనిపై రాజకీయాలు చేయట్లేదని చెప్పారు.

టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ… శ్రీ గోవింద రాజస్వామి రథానికి ప్రమాదం జరగలేదని తెలిపారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మకూడదని అన్నారు. ఆ రథాన్ని వెనకకు జరిపి పెట్టినట్లు చెప్పారు. పది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులో తెచ్చాయని తెలిపారు. పది ద్విచక్ర వాహనాలు, ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయని చెప్పారు.

Ritlal Yadav: రామచరితమానస్ మసీదులో రాశారట.. మీద మరో వివాదానికి తెరలేపిన ఆర్జేడీ నేత