Site icon 10TV Telugu

AP Govt: ఏపీలో రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వీళ్లకే.. అకౌంట్లలో జమయ్యేది ఎప్పుడంటే..?

Annadata Sukhibhav scheme

Annadata Sukhibhav scheme

Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల వారిగా అర్హులైన రైతుల జాబితాను తెప్పించుకున్న ప్రభుత్వం.. నిధుల విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

పీఎం కిసాన్ ద్వారా యేటా మూడు దఫాలుగా రూ.6వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. పీఎం కిసాన్ పథకం డబ్బులతో పాటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా యేటా 14వేలు సాయం అందించేందుకు సిద్ధమైంది. దీంతో మూడు విడతల్లో రైతులకు ఏడాదికి మొత్తం రూ. 20వేలు అందనున్నాయి.

అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 47.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించామని ఇప్పటికే అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయాల సర్వే ప్రకారం 98శాతం మంది ఈకేవైసీ పూర్తి చేశారని.. మిగిలిన 61 వేల మంది రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్రం నిధులు విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో డబ్బులు వేస్తుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే, జులై రెండో వారంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తారని తెలుస్తోంది.

అన్నదాత సుఖీభవ పథకంలో పేరు ఉందోలేదో తెలుసుకోవాలంటే.. సచివాలయాలకు వెళ్లి లిస్ట్‌లో చెక్ చేసుకోవాలి. లేదంటే.. ప్రభుత్వ వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి చెక్ స్టేటస్ ఆప్షన్‌ క్లిక్ చేసి చెక్ చేస్కోండి. రైతు తన ఆధార్ నంబర్‌‌ను ఎంటర్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులను సంప్రదించి.. వారు సూచనల మేరకు పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉంటే.. వారి బ్యాంకు ఖాతాల్లోనూ అన్నదాత సుఖీభవ డబ్బులు జమకానున్నాయి.

Exit mobile version