ఒంగోలులో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. చేతులెత్తేసిన మాజీమంత్రి బాలినేని..!

పార్టీ మారబోతున్నారనే సమాచారం ఉన్నా.. ఉండే వాళ్లు ఉండండి పోయే వాళ్లు పొండి. పార్టీ మారే వారిని నేను ఆపలేనంటూ ఇటీవల బాలినేని అన్నారు.

Ongole Ysrcp (Photo Credit : Google)

Ongole Ycp : ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత సహా, డిప్యూటీ మేయర్, 10మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఒంగోలు కార్పొరేషన్ స్వాధీనం చేసుకునే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది.

గత ఎన్నికల్లో 50 కార్పొరేటర్ల స్థానాలకుగాను 43 స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. ప్రస్తుతం టీడీపీలో 17 మంది చేరికతో.. టీడీపీలో కార్పొరేటర్ల సంఖ్య 24కి చేరింది. అఫిషియో ఓటు హక్కు ఉన్న ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలతో పాటు ఒంగోలు ఎంపీకి ఉండటంతో కార్పొరేటర్ల సంఖ్య 27కి చేరింది. ఈ పరిస్థితుల్లో ఒంగోలు కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు టీడీపీకి స్పష్టమైన మెజారిటీ దక్కినట్లు అయ్యింది.

గత నెలన్నర నుండి ఆపరేషన్ కార్పొరేషన్ ను టీడీపీ మొదలు పెట్టింది. తన పదవిని దక్కించుకునేందుకు ఓవైపు వైసీపీ సీనియర్ నేత మాజీమంత్రి బాలినేని వెంట ఉంటూనే మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్, ఎంపీ మాగుంటతో చర్చలు సాగించారు మేయర్ గంగాడ సుజాత. మేయర్ పదవిని కంటున్యూ చేసేందుకు 10రోజుల క్రితం వరకు టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ అంగీకరించలేదు. ఒంగోలు ఎంపీ మాగుంటతో మేయర్ గంగాడ సుజాత చర్చల అనంతరం పరిణామాలు మారిపోయాయి. సొంత పార్టీ కార్పొరేటర్లు, మేయర్ ను కాపాడుకోవడంలో మాజీమంత్రి బాలినేని చేతులెత్తేశారు.

పార్టీ మారబోతున్నారనే సమాచారం ఉన్నా ఉండే వాళ్లు ఉండండి పోయే వాళ్లు పోండి. పార్టీ మారే వారిని నేను ఆపలేనంటూ ఇటీవల మీడియా ముందు, గంగాడ సుజాత ముందే బాలినేని వ్యాఖ్యలు చేశారు. మేయర్ పదవి చేజారే పరిస్థితి రావడంతో వైసీపీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. అటు టీడీపీ శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. ఒంగోలు నగర అభివృద్ధి పదంలో కార్పొరేషన్ కీలకంగా మారింది.

Also Read : ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో వైసీపీ నేత..! జోగి రమేశ్‌ చుట్టూ ఉచ్చుబిగిస్తున్న ప్రభుత్వం

ట్రెండింగ్ వార్తలు