టీడీపీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపించారు. ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు 2020, మార్చి 09వ తేదీ సోమవారం ఉదయం ఆయన బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు తనను బాధించాయని చెప్పుకొచ్చారు.
ఓటమి తర్వాత..పార్టీ యొక్క వైఖరి తనకు నచ్చలేదని, జేఏసీ పేరిట..తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారాయన. అసెంబ్లీ సమావేశాలకంటే ముందు..వైసీపీ వైపు మొగ్గు చూపినా..ఇప్పటి వరకు తాను వైసీపీ అధిష్టానంతో ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. అయితే… ఏ పార్టీలో ఉన్నా..ప్రజల కోసమే పనిచేస్తానన్నారు. ఇటీవలే..మూడు రాజధానుల అంశంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
See Also | కరోనా పోలీసు ప్రిడేటర్స్.. స్మార్ట్ హెల్మట్లతో వైరస్ బాధితులను ఎలా గుర్తిస్తున్నారో చూడండి!
అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును సులభంగానే గట్టెక్కినా..శాసనమండలిలో వైసీపీ ప్రయత్నాలు నెరవేరలేదు. ఈ క్రమంలో..డొక్కా మాణిక్య వరప్రసాద్..ఎవరికీ అంతుబట్టని విధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. తొలి రోజు మండలి సమావేశానికి హాజరైన డొక్కా..రెండో రోజు హాజరు కాలేదు. డొక్కా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం మొదలైంది. మరి ఆయన వైసీపీలో చేరుతారా ? లేదా ? అనేది చూడాల్సి ఉంది.
Read More : మూడేళ్ల బాలుడికి కరోనా : భారత్‌లో 41కి చేరిన కేసులు