Duvvada Srinivas, Divvela Madhuri (Image Credit To Original Source)
Divvela Madhuri: దివ్వెల మాధురి, అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్ ఎదురైంది. అప్పన్న కనిపించడం లేదంటూ అతడి భార్య శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం నుంచి తన భర్త కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్లారని ఆమె అంటున్నారు.
విచారణ కోసం తీసుకెళ్లారా? కిడ్నాప్ చేశారా? తేల్చాలని డిమాండ్ చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఈ రాజకీయాలకు తాము బలైపోయామన్నారు. ఏడాదిన్నర నుంచి సొంతూరు నిమ్మాడలో అడుగుపెట్టలేకపోతున్నామని చెప్పారు.
Also Read: Switzerland: న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం.. స్విట్జర్లాండ్‌లో పేలుడు.. 40 మంది మృతి
కాగా, ఇటీవల మాధురి రిలీజ్ చేసిన ఓ ఆడియో రికార్డింగ్ సంచలనమైన విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు అప్పన్నకు, మాధురికి మధ్య సంభాషణ జరిగినట్లు అందులో ఉంది.
దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్లాన్ జరిగే ముప్పు ఉన్నట్లు అందులో అప్పన్న చెప్పినట్లు తెలుస్తోంది. నరసన్నపేట లేదంటే నిమ్మాడ జంక్షన్ వద్ద దాడి జరిగే ముప్ప ఉందని అప్పన్న హెచ్చరించినట్లు అందులో ఉంది.
దీంతో దువ్వాడ శ్రీనివాస్ స్పందించి అర్ధరాత్రి హైవేపై వార్నింగ్ ఇచ్చారు. తనపై దాడి చేస్తామని ప్రగల్భాలు పలికారని, వారు చెప్పిన చోటికే వచ్చానని, ఏం చేస్తారో చేసుకోవాలని నిమ్మాడ సెంటర్‌లో సవాల్ విసిరారు. ఈ ఘటన ఇటీవల చర్చనీయాంశమైంది.