Vijayawada Thar Clash Case: విజయవాడ థార్ జీపులతో స్ట్రీట్ ఫైట్ కేసులో సంచలన విషయాలు..

వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ల్యాబ్ కు తరలించారు. ఇద్దరు నిందితులను మరింత లోతుగా విచారిస్తున్నారు పటమట పోలీసులు.

  • Updated on- May 22, 2026 / 06:43 PM IST

Vijayawada Thar Clash Case: విజయవాడలో థార్ జీపులతో నడిరోడ్డుపై ఇద్దరు యువకులు హంగామా సృష్టించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఇద్దరికీ (రోహిత్ లింగమనేని, బొల్లా ఓంకార్) డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించారు పటమట పోలీసులు. ఈ టెస్టులో బొల్లా ఓంకార్ కు పాజిటివ్ వచ్చింది. ఇక రోహిత్ లింగమనేని థార్ జీపును పోలీసులు సీజ్ చేశారు. ఆ జీపులో స్టెరాయిడ్స్ గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ల్యాబ్ కు తరలించారు. ఇద్దరు నిందితులను మరింత లోతుగా విచారిస్తున్నారు పటమట పోలీసులు.

విజయవాడలో ఇద్దరు యువకులు నడిరోడ్డుపై థార్ జీపులతో బీభత్సం సృష్టించారు. ఓ యువతి విషయంలో థార్ జీపులతో రోడ్డుపై బాహాబాహీకి దిగారు. పటమట హై టెన్షన్ 100 అడుగుల రోడ్డులో థార్ జీపులతో ఢీకొట్టుకుంటూ కలకలం సృష్టించారు. తర్వాత ఐరన్ రాడ్లతో జీపు అద్దాలు పగలగొట్టారు. నడిరోడ్డుపై సినిమా యాక్షన్ సీన్స్ తలపించేలా వీరు చేసిన హడావుడితో స్థానికులు, తోటి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు.

విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళే సరికి ఇద్దరు యువకుల్లో ఒకడు పరార్ అయ్యాడు. మరొకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో యువతి థార్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువకుల్లో బొల్లా ఓంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ కోసం గాలిస్తున్నారు.

Also Read: ఏపీలో మండిపోతున్న ఎండలు.. బుధవారం వరకు ఇంతే.. ఆ సమయంలో బయటకు రావొద్దు..