Thalliki Vandanam : తల్లికి వందనం రూ.13వేలపై లబ్ధిదారులకు మరో గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన
Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Talliki Vandanam Scheme
Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రంలోని అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, అర్హత ఉండి పలు సాంకేతిక కారణాలతో పథకం డబ్బులు అందని వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈనెల 7వ తేదీతో ముగిసింది.
Also Read : AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి పడిపోయిన ట్రావెల్స్ బస్సు, ఐషర్ వాహనం..
అర్హత కలిగి ఉన్నప్పటికీ తల్లికి వందనం పథకం డబ్బులు అందని వారు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది మళ్లీ అర్హత కలిగిన పత్రాలతో దరఖాస్తులు చేసుకున్నారు. ఇందుకుగాను మొత్తం 4వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీరి అర్హతలను అధికారులు మరోసారి పరిశీలించనున్నారు. మరోవైపు.. ఈ ఏడాది కొత్తగా స్కూళ్లలో చేరిన వారు, ఇంటర్ విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించేందుకు ఈనెల 25వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీటన్నింటిని పరిశీలించిన తరువాత ఈనెల 30న అర్హుల జాబితాను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అదేరోజు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
‘తల్లికి వందనం’ పథకంకు అర్హతలు ఇవే..
♦ విద్యార్థి కుటుంబానికి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి.
♦ 10 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు.
♦ కుటుంబంలో ఎవరికీ ఫోర్ వీలర్ (నాలుగు చక్రాల) వాహనం ఉండకూడదు.
♦ నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటకూడదు.
♦ పట్టణాల్లో 1,000 చదరపు అడుగులకు పైగా ఇల్లు/స్థలం ఉండకూడదు.
♦ ఆదాయ పన్ను (ఇన్కమ్ ట్యాక్స్) చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు.
