Thalliki Vandanam : తల్లికి వందనం లబ్ధిదారులకు మరో గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన

Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Talliki Vandanam Scheme

Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రంలోని అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, అర్హత ఉండి పలు సాంకేతిక కారణాలతో పథకం డబ్బులు అందని వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈనెల 7వ తేదీతో ముగిసింది.

Also Read : AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి పడిపోయిన ట్రావెల్స్‌ బస్సు, ఐషర్ వాహనం..

ఈ ఏడాది కొత్తగా స్కూలులో చేరిన వారు, ఇంటర్ విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించేందుకు ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉంది. వీటిని పరిశీలించిన అనంతరం ఈనెల 30న అర్హుల జాబితాను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అదేరోజు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.