Chandrababu Naidu: చంద్రబాబుకి బిల్‌గేట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదేమిటో తెలుసా..? చంద్రబాబు ఏమన్నారంటే..

చంద్రబాబు నాయుడుకు బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తాజాగా ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా తెలిపారు.

Chandrababu Naidu

Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజులు దావోస్ లో పర్యటించారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల అధినేతలు, సీఈవోలతో చంద్రబాబు సహా ఆయన బృందం భేటీ అయ్యింది. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అనువైన వాతావరణం ఉందని, అన్నివిధాల ప్రభుత్వ సహకారం ఉంటుందని కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేశ్ తో కలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గతంలో వారిమధ్య ఉన్న పరిచయాన్ని బిల్ గేట్స్, చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Also Read: Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్ బై.. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా పత్రాన్ని అందజేసిన విజయసాయిరెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిల్ గేట్స్ ను ఒప్పించి హైదరాబాద్ లో మైక్రోసాప్ట్ కేంద్రాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని చంద్రబాబు బిల్ గేట్స్ వద్ద ప్రస్తావించారు. తమపై నమ్మకంతో మైక్రో సాఫ్ట్ కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని బిల్ గేట్స్ కు చంద్రబాబు వివరించారు. అదేసమయంలో దక్షిణ భారతదేశంలో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గేట్ వేగా నిలపాలని కోరారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తాజాగా ఆ విషయాన్ని చంద్రబాబు ట్విటర్ వేదికగా తెలిపారు.

Also Read: Kodali Nani : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కొడాలి నాని..

బిల్ గేట్స్ త్వరలో ‘సోర్స్ కోడ్’ అనే పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. దానిని చంద్రబాబుకు అందజేశారు. దానిపై ‘నా మిత్రుడు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం చాలా బాగుంది’ అని బిల్ గేట్స్ రాశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. చంద్రబాబు ట్వీట్ ప్రకారం.. ‘‘ సోర్స్ కోడ్ పేరిట నా స్నేహితుడు బిల్ గేట్స్ పుస్తకం విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదలకానున్న పుస్తక కాపీ నాకు బహుకరించినందుకు ధన్యవాదాలు. బిల్ గేట్స్ తన జీవిత ప్రయాణంలోని అనుభవాలు, పాఠాల సమాహారంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. కళాశాల వదిలి మైక్రోసాఫ్ట్ ప్రారంభ నిర్ణయం వరకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం.. బిల్ గేట్స్ కు మా శుభాకాంక్షలు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.