Daggubati Purandeswari(Photo : Google)
Purandeswari – AP Debts : ఆంధ్రప్రదేశ్ అప్పులపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రం అప్పులపై పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం.. చేసిన అప్పులకు, తప్పులకు మల్లగుల్లాలు పడుతోందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక లక్ష 77వేల 21 కోట్ల అప్పు చేసినట్లు తెలిసిందన్నారు. గతంలో నేను ఏపీ అప్పులు 10 లక్షల కోట్లు అంటే.. 7 లక్షల కోట్లు మాత్రమే జగన్ ప్రభుత్వం చేసినట్లు చెప్పడం జరిగిందన్నారు.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు పురంధేశ్వరి. ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో మాత్రమే లక్షా 77 వేల కోట్లు అని నిర్మలా సీతారామన్ చెప్పారని పురంధేశ్వరి తెలిపారు. మరి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి, మద్యం ఆదాయం చూపి తెచ్చిన అప్పులు చాలా ఉన్నాయన్నారు. ఇవన్నీ కలిపి 10 లక్షల కోట్లు అప్పు ఉందన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను అని పురంధేశ్వరి చెప్పారు. వీటిని వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాతపూర్వకంగా తెలియజేశామన్నారు పురంధేశ్వరి. కోవిడ్ వల్ల 40వేల కోట్లు అప్పు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందన్నారు.
Also Read..Srikakulam: శ్రీకాకుళంలో టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ సూపర్ ప్లాన్!
ఇతర వనరుల ద్వారా అదనంగా అప్పులు చేశారని తెలిపారు. రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాలేదన్నారు. 15 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్బీఐకి ఎలా చూపించారు అని పురంధేశ్వరి ప్రశ్నించారు. దీని గురించి జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఏపీ అప్పులపై ఇటీవల కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన పార్లమెంటులో ప్రకటన చేశారు. చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే జగన్ సర్కార్ చేసిన అప్పు కేవలం 1.77 లక్షల కోట్లు మాత్రమేనని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నిర్మలమ్మ చేసిన ఆ ప్రకటనపై పురంధేశ్వరి స్పందించారు. నిర్మలా సీతారామన్ రిజర్వ్ బ్యాంకు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల గురించి మాత్రమే సమాధానం చెప్పారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌పై రూ.10.77 లక్షల కోట్లు అప్పుల భారం ఉందని తాను చెప్పానన్నారు. ఇందులో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసిన అప్పు రూ.7 లక్షల కోట్లు అని తెలిపారు.