Somu Veerraju : ఆత్మకూరులో మా పార్టీ కార్యకర్తలపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలి-సోము వీర్రాజు

కడప జిల్లా కేంద్ర  కారాగారంలో ఉన్న నంద్యాల పార్లమెంటు బిజెపి అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న పరామర్శించారు.

somu veerraju

Somu Veerraju :  కడప జిల్లా కేంద్ర  కారాగారంలో ఉన్న నంద్యాల పార్లమెంటు బిజెపి అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న పరామర్శించారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి రాష్ట్ర పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ఒక వర్గం వారు చంపేయ్యాలని అనుకున్నారు, మా దగ్గర పక్కా అధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

శ్రీకాంత్ పైనే దాడి జరిగితే అతనిపైన హత్యాయత్నం ‌కేసు పెడతారా అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఇప్పటికైన జరిగిన ఘటనపై పోలీసులు సమగ్రమైన విచారణ చేసి, శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసు ఎత్తి వేసి సెక్యూరిటీ ఇవ్వాలని సోము వీర్రాజు కోరారు.  బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆత్మకూరు డీయస్పీ రమ్మంటేనే వెళ్లారు,అక్కడ అమె పని తీరు సరిగా లేదు…. డీయస్పీని   వెంటనే సస్పెండ్ చేయ్యాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం మతతత్వ ధోరణి అవలంబించడం మూలంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
Also Read : Adilabad Rains : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం-ఆందోళనలో అన్నదాతలు
ఆత్మకూరు ఘటనలో   సీయం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని.. ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే న్యాయంగా దర్యాప్తు చేయ్యాలని అన్నారు. హిందువుల మీద కేసు పెట్టాలని చూస్తే మీ పతనం తప్పదని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందువుల మీద అక్రమ కేసు పెడితే  ఛలో ఆత్మకూరు పిలుపునిస్తాం….పోలీస్ స్టేషనపై దాడి చేసి పోలీసులను కొట్టిన వారిపై కేసు పెట్టకూడదని చెప్పడం దారుణం అని ఆయన అన్నారు.   ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి పార్టీలు మార్చినట్లు మాటలు మార్చడం సరికాదు అని ఆయన హితవు పలికారు.  శ్రీశైలంలోని ముస్లింల దుకాణాలు తొలగించే దమ్ము మీకు ఉందా అని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.