NDA Meeting : కీలక పరిణామం.. ఎన్డీయే భేటీకి జనసేనకు ఆహ్వానం

NDA Meeting : పవన్ కల్యాణ్ తో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశానికి వెళ్లనున్నారు.

NDA Meeting – Pawan Kalyan : ఎన్డీయే పక్ష సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. ఈ నెల 18న ఢిల్లీలో జరగనున్న ఎన్డీయే పక్ష సమావేశంలో పాల్గొనాలని బీజేపీ అగ్రనాయకత్వం కొన్నిరోజుల కింద ఇన్విటేషన్ పంపింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ తో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశానికి వెళ్లనున్నారు. ఈ నెల 17న సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. తర్వాతి రోజు భేటీలో పాల్గొనబోతున్నారు.

”ఈ నెల 18న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేంలో పాల్గొనవలసినదిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కి ఆహ్వానం అందింది. ఎన్డీఏలో భాగస్వాములైన రాజకీయ పక్షాల అగ్రనేతలు హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి పవన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 17 సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కొద్ది రోజుల కిందటే పార్టీకి ఈ ఆహ్వానం అందింది” అని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరగనుంది. ఇందులో పాల్గొనాల్సిందిగా పలు పార్టీలకు బీజేపీ పెద్దలకు ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగా ఏపీలో బీజేపీకి దగ్గరగా ఉన్న జనసేన పార్టీని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహాన్ని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఎన్డీయే పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

Also Read..Pawan Kalyan : మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు, జనం బాగుండాలంటే జగన్ పోవాలి- పవన్ కల్యాణ్

ఈ సమావేశానికి పవన్ కు ఆహ్వానం అందింది. దీనికి పవన్ కల్యాణ్ హాజరుకాబోతున్నారు. ఈ ఆహ్వానంతో.. ఎన్డీయే కూటమిలో జనసేన పార్టీ కూడా ఉన్నట్లే అనేది అర్థమవుతుంది. ఎన్డీయే సమావేశానికి వెళ్లనున్న పవన్.. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అపాయింట్ మెంట్ దొరికితే వారందరిని పవన్ కల్యాణ్ కలిసే ఛాన్స్ ఉంది.

ఎన్డీయే సమావేశానికి హాజరు కావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందుతుందా? లేదా? అనే దానిపై కొంతకాలం చర్చ జరిగింది. అయితే, ఎన్డీయే మీటింగ్ కు అటెండ్ అవ్వాలంటూ బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పవన్ కు ఆహ్వానం అందడం, పవన్ కూడా ఢిల్లీకి వెళ్లి సమావేశంలో పాల్గొననున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు