Adinarayana Reddy : పవన్ కల్యాణ్‌ని వైసీపీ ఏమయినా చేస్తుంది, కేంద్రం Y కేటగిరీ భద్రత కల్పించాలి : ఆదినారాయణ రెడ్డి

పవన్ కల్యాణ్ ఎదుగుతుంటే తట్టుకోలేక పోతున్నారు. పవన్ భద్రత విషయంలో బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకోవాలి. Y కేటగిరీ భద్రత కల్పించాలి.

pawan kalyan..Adinarayana Reddy

BJP leader Adinarayana Reddy : పవన్ కల్యాణ్ కు ప్రాణహాని ఉంది..వైసీపీ ఏమయినా చేస్తుంది అంటూ మాజీ మంత్రి,బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఎదుగుతుంటే తట్టుకోలేక పోతున్నారనీ..పవన్ భద్రత విషయంలో బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని సూచించారు. పవన్ కు రక్షణ కల్పించాలని..Y కేటగిరీ భద్రత కల్పించాలని సూచించారు.

అమిత్ షా, నడ్డాలు ఏపిలో మోడి పాలన ఎలా ఉందనే దానిపై సంకేతాలు ఇచ్చారని..ఏపిలో ఇళ్ల కోసం కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంది అంటూ విమర్శించారు.లిక్కర్ కింగ్ లు స్టిక్కర్ కింగ్ లుగా మారారంటూ ఎద్దేవా చేశారు. ఏపిలో ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందని..ఏపీలో జరిగే అవినీతి గురించి నడ్డా సాఫ్టు వేర్ స్టైల్లో చెబితే అమిత్ షా హార్డ్ వేర్ స్టైల్లో చెప్పారని అన్నారు. అమిత్ షా మాట్లాడిన తీరుకు వైసీపీ భయపడిపోతోందన్నారు.

Pawan Kalyan: అధికారంకోసం వైసీపీ ఏం చేయడానికైనా సిద్ధమే.. జనసైనికులు జాగ్రత్తగా ఉండాలి..

జగన్ ఆలోచన విధ్వంస రచనతో సొంత చిన్నాయననే చంపించాలరు అంటూ ఆరోపించారు. వివేకా హత్య కేసును అంతులేని కథగా మార్చేశారని..జూలై 3 న అంతు లేని కథను సుప్రీంకోర్టులో అంతం కానుందని అన్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది వైయస్ వాళ్ళు వస్తారో అనేది బయటకు రానుందన్నారు. వివేకా కేసులో సీబీఐ గడువు పెంచుతారని అన్నారు. జగన్ నిత్య అసంతృప్త వాది అంటూ ఎద్దేవా చేశారు. విశాఖ ఎంపి కుటుంబ కిడ్నాప్ నాటకమేనని అన్నారు. వివేకా హత్య కేసులో జగన్ నైతిక బాధ్యత వహించాలని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు.

కాగా.. కాకినాడలో పవన్ మాట్లాడుతు.. నాకు ప్రాణహాని ఉందని, సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన నేతలు, జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. నేటి వైసీపీ పాలకులు అధికారంకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని..తన కోసం సుపారీ గ్యాంగులను దింపారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Buddha Venkanna: ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంలో వైసీపీ పెద్దల హస్తం ఉంది.. సీబీఐతో విచారణ జరిపించాలి

 

 

ట్రెండింగ్ వార్తలు