Vishnuvardhan Reddy : రాజకీయ స్వార్థం కోసం కేసీఆర్ ట్రాప్ లో పడిన జేడీ లక్ష్మీనారాయణ : విష్ణువర్ధన్ రెడ్డి

విశాఖ ఉక్కుపై కేసీఆర్, జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను భారత ప్రభుత్వమే నిలబెట్టగలుగుతుందన్నారు.

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy : జేడీ లక్ష్మీనారాయణపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ను పొగుడుతూ కేఏ పాల్ తో కలిసి మరో రకమైన రాజకీయాలు ప్రారంభించారని విమర్శించారు. విశాఖ ఉక్కు అంశం ఆధారంగా రాజకీయ స్వార్థం కోసం ఎంపీ కావాలని అత్యుత్సాహంతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ కేసీఆర్ ట్రాప్ లో పడినట్టున్నారని పేర్కొన్నారు. జయ ప్రకాష్ నారాయణ లాంటి సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి విశాఖ ఉక్కు మనుగడకు పెట్టుబడులు సేకరించాలని చెబుతున్నారని చెప్పారు.

బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి, “అన్నీ మంచి శకునములే” చిత్రం డైరెక్టర్ నందిని రెడ్డి, నటుడు సంతోష్ శోభన్ నటి మాళవిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ కుట్రతో విశాఖ ఉక్కు పరిశ్రమ వెలవెలలాడే పరిస్థితి నెలకొందన్నారు. విశాఖ ఉక్కుపై కేసీఆర్, జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను భారత ప్రభుత్వమే నిలబెట్టగలుగుతుందన్నారు.

BJP Vishnu Vardhan Reddy : అమిత్ షా-జూ.ఎన్టీఆర్ కలయిక పెను సంచలనమే, 2024లో బీజేపీ-జనసేన కూటమికే అధికారం-విష్ణువర్ధన్ రెడ్డి

ప్రధానమంత్రికి విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి ఉందని చెప్పారు. విశాఖ ఉక్కును కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే కొత్త కొత్త విన్యాసాలు, ప్రయత్నాలు చేస్తూ అపోహలు సృష్టిస్తూ కేసీఆర్ కు మేలు చేసే విధంగా జేడీ లక్ష్మీనారాయణ వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. జేడీ లక్ష్మీనారాయణ వారి పార్టీలో చేరి రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు.

2024 ఎన్నికల్లో ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ ఏపీ రాజకీయాల్లో ఉండదబోదని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఏపీపై దృష్టి పెడుతుందని చెప్పారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీలో కీలకమైన మార్పులు జరుగుతాయని తెలిపారు. ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వలసలు ఉంటాయని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.