Somuveerraju : 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : సోమువీర్రాజు

వైసీపీ సర్కార్‌పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని సోమువీర్రాజు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పనిచేస్తామన్నారు. వైసీపీ సర్కార్‌ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు.

Somuveerraju

BJP president Somuveerraju : బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోమువీర్రాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మరోసారి స్పష్టం చేశారు.

రెండు నెలల క్రితమే అమిత్‌ షా దిశానిర్దేశం చేశారని… ఇప్పటికే రోడ్డుమ్యాప్ కూడా అందిందన్నారు. రోడ్డుమ్యాప్‌ ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. వైసీపీ సర్కార్‌పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని సోమువీర్రాజు అన్నారు.

Somu veerraju On Schemes : జగన్ నవరత్నాల కంటే ఎక్కువగా కేంద్రం ఇస్తోంది-సోమువీర్రాజు

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పనిచేస్తామన్నారు. వైసీపీ సర్కార్‌ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతపై ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి విస్తరించే విధంగా ముందుకు వెళ్తామన్నారు.