జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తప్పుపట్టింది. మూడు రాజధానులు కరెక్ట్ కాదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. పరిపాలన
జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తప్పుపట్టింది. మూడు రాజధానులు కరెక్ట్ కాదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణకు బీజేపీ పూర్తి వ్యతిరేకం అని చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణకు మాత్రమే బీజేపీ అనుకూలం అన్నారు. మూడు రాజధానులు ప్రజా వ్యతిరేక నిర్ణయం అన్నారు. సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కన్నా మండిపడ్డారు. చంద్రబాబుపై కోపంతోనే ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారని గుర్తు చేసిన కన్నా.. జగన్ పాలనలోనూ ప్రజలు సుఖంగా లేరని చెప్పారు. జనంలో మళ్లీ ఆ కసిని 2024లో చూస్తారని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో మీడియాతో బీజేపీ నేతలు కన్నా, జీవీఎల్ మాట్లాడారు.
సీఎం జగన్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ని పిచ్చి తుగ్లక్ తో పోల్చారు. పరిపాలన వికేంద్రీకరణకు కేంద్రం సహకారం ఉందని వైసీపీ నేతలు చెప్పడాన్ని కన్నా ఖండించారు. దీనిపై త్వరలోనే జనసేనతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని, పోరాటం చేస్తామని కన్నా చెప్పారు. మూడు రాజధానుల గురించి ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పారా? అని జగన్ ను ప్రశ్నించారు కన్నా.
కన్నా కామెంట్స్:
* 2024లో మళ్లీ ఆంధ్రుల కసి చూస్తారు
* మూడు రాజధానుల నిర్ణయం ప్రజా వ్యతిరేకం
* వైసీపీ.. చంద్రబాబు మార్కు రాజకీయాలు చేస్తోంది
* బీజేపీ.. పరిపాలన వికేంద్రీకరణకు మాత్రమే వ్యతిరేకం
* అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
* ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
* 2024లో ప్రజలే తగిన సమాధానం చెబుతారు
* జనంలో మళ్లీ ఆ కసిని 2024లో చూస్తారు
* చంద్రబాబుపై కోపంతోనే జనం జగన్ కు అవకాశం ఇచ్చారు
* జగన్ పాలనలో కూడా ప్రజలు సంతోషంగా లేరు
* రాజధాని వికేంద్రీకరణ పూర్తిగా ప్రజావ్యతిరేక నిర్ణయం
* సీఎం జగన్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు
* జగన్ పిచ్చి తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారు
* కేంద్రం సహకారం ఉందని చెప్పడాన్ని ఖండిస్తున్నాం
* త్వరలో జనసేనతో కలిసి బీజేపీ పోరాడుతుంది
* మూడు రాజధానులపై ఎన్నికల్లో ప్రజలకు చెప్పారా
* జనసేనతో కలిసి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం
* రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రంపై రుద్దొద్దు
* కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తే టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా
* ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే వెంటనే విచారణ జరిపించండి
* జనసేనతో కలిసి ప్రజా వ్యతిరేక ఉద్యమాలపై పోరాడతాం
* అమరావతిలో టీడీపీ 5 భవనాలు కూడా కట్టలేదు
* ప్రతిపక్ష పాత్రలో టీడీపీ పూర్తిగా విఫలమైంది
* స్వార్థ ప్రయోజనాలకే మూడు రాజధానులు
* మూడు రాజధానులు అనేది బోగస్