ఏం జరుగుతోంది : యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి బోడే ప్రసాద్ 

  • Publish Date - November 15, 2019 / 03:35 PM IST

టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. తనకు బోడే ప్రసాద్ డబ్బులిచ్చారంటూ వంశీ చేసిన ఆరోపణలను ఖండించకపోవడంతో వైవీబీ అలిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉయ్యూరులోని యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి బోడే ప్రసాద్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాబు ఆదేశాలతో రాజేంద్ర ప్రసాద్‌ను ప్రసాద్ కలిసినట్లు సమాచారం.

వంశీ చేసిన తీవ్ర విమర్శలపై ఇద్దరు నేతల మధ్య రహస్య మంతనాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయవాడలో నవంబర్ 16వ తేదీ శనివారం మీడియా ఎదుట అన్ని విషయాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. మరోవైపు వంశీ చేసిన కామెంట్స్..తదితర పరిణామాలపై పార్టీ అధినాయకత్వం ఉదాసీనంగా ఉందనే భావనలో వైవీబీ ఉన్నట్లు టాక్. 
పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

దీంతో పార్టీ అధినాయకత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడం, పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల వంశీ రెస్పాండ్ అయ్యారు. టీడీపికి తానే రాజీనామా చేశానన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను టీడీపీని వీడితే నష్టం లేదని..లోకేష్ ఉంటేనే నష్టమని ఎద్దేవా చేశారు. రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞత లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై స్పందించారు. తనకు మోజు లేదని, మంత్రి కావాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. 
Read More : టార్గెట్ బాబు : లోకేష్ అనొద్దు..పప్పు అనండి – వల్లభనేని వంశీ