బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్.. ప్రచారంపై స్పందించిన మాజీ మంత్రి
Botsa Satyanarayana : మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్టోక్ రావడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Harish Thanniru
- Updated on- February 27, 2026 / 03:23 PM IST
Botsa Satyanarayana
Botsa Satyanarayana : మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్టోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించినట్టు తెలిసింది. వైద్యులు బొత్సకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read : Ayesha Meera : జడ్జి ముందు బోరున ఏడ్చేసిన అయేషా మీరా తల్లిదండ్రులు.. అస్థికలు అప్పగించిన అధికారులు
బొత్స సత్యనారాయణ ఆరోగ్య విషయంపై వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. బొత్సకు ప్రమాదం ఏమీలేదని చెప్పారు. గురువారం రాత్రి ఇబ్బందిగా అనిపించడంతో ఆయన సొంత వాహనంలో హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం ఉదయం సిటీ న్యూరో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడి వైద్యులు బొత్సకు చికిత్స అందించి పలు టెస్టులు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పారని తెలిపారు.
ఇదిలాఉంటే.. ఆస్పత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలతో బొత్స ఫోన్లో మాట్లాడినట్లు, శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నట్లు తెలిసింది. ఆయనను ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బొత్స అనారోగ్యం మీద పెద్ద ఎత్తున ప్రచారం జరగడంపై ఆయన స్పందించారు. రెగ్యులర్ చెకప్ లో భాగంగానే తాను హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. తన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
