Botsa Satyanarayana : మత్స్యకారులకు అండగా ఉండాలి.. రావణ్‌కు న్యాయ సహాయం తప్పా? బొత్స సంచలన వ్యాఖ్యలు!
Botsa Satyanarayana : మత్స్యకారులు గల్లంతు కావడం అత్యంత దురదృష్టకరం.. గతంలో బోట్లు కాలిపోయిన ఘటనలో రూ.35 లక్షల పరిహారం ఇచ్చామని బొత్స సత్యనారాయణ అన్నారు.
- Sreehari A
- Published on- July 13, 2026 / 08:43 PM IST
Botsa Satyanarayana
- మత్స్యకారుల విషాదంలోనూ రాజకీయాలే కనిపిస్తున్నాయి..
- బోట్లు కాలిపోయిన ఘటనలో రూ.35 లక్షల పరిహారం ఇచ్చాం
- ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలి : బొత్స కామెంట్స్
Botsa Satyanarayana : విశాఖ జిల్లాలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శిస్తారని మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
బాధిత కుటుంబాలకు మానవతా దృక్పథంతో ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా రావణ్‌కు న్యాయ సహాయం, అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలు తదితర అంశాలపై కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
విశాఖ జిల్లాలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖకు వస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించడంతో పాటు వారికి ఎంత మేర సాయం చేస్తామో పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారని చెప్పారు.
మత్స్యకారులు గల్లంతు దురదృష్టకరం :
మత్స్యకారులు గల్లంతు కావడం అత్యంత దురదృష్టకరమైన ఘటనగా బొత్స పేర్కొన్నారు. దీనిపై వైసీపీ రాజకీయాలు చేస్తోందని అధికార పార్టీ ఆరోపించడం ఎంతమాత్రం సరికాదన్నారు. బాధిత కుటుంబాలు పరిహారం పెంచాలని కోరుతున్నాయని, మానవతా కోణంలో ప్రభుత్వం ముందుకు వచ్చి వారికి అండగా నిలవాలని బొత్స డిమాండ్ చేశారు.
Read Also : Term Insurance : విదేశాల్లో మరణిస్తే భారత్‌లో ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందా? ప్రతి NRI తప్పక తెలుసుకోండి..!
గతంలో బోట్లు కాలిపోయిన ఘటనలో రూ.35 లక్షల పరిహారం ఇచ్చామని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఆ కుటుంబాలే చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి బాధితులందరిని ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలని కోరారు.
న్యాయ సహాయం చేస్తే తప్పేంటి? :
రావణ్‌కు న్యాయ సహాయం అందించడంలో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి దేశద్రోహం కేసు నమోదు చేసినప్పుడు న్యాయ సహాయం చేయడం తప్పు కాదన్నారు.
అధికారిక సభల్లోనూ రాజకీయాలు మాట్లాడటం ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వంలోనే చూస్తున్నానని బొత్స విమర్శించారు. రావణ్‌తో తమపై విమర్శలు చేయించినప్పుడు టీడీపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. సాధు పరిషత్‌లు రాజకీయాలు మాట్లాడటం ఏమిటని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణలో మీ తమ్ముడే ఉన్నాడని, అప్పట్లో ముఖ్యమంత్రిని ‘సైకో’ అని అన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? అని బొత్స ప్రశ్నించారు. పచ్చ కామెర్ల వాళ్లకు లోకం పచ్చగా కనిపించినట్లు ఈ ప్రభుత్వానికి అన్నీ రాజకీయంగానే కనిపిస్తున్నాయని విమర్శించారు. తిరుపతి లడ్డు అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తుంటే.. చివరకు అది వారి మెడకే చుట్టుకునేలా మారుతోందని బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు.
