Botsa Satyanarayana : బొత్స రూటే సెపరేటు… మొదట గవర్నర్‌కు ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రి వర్గం ఈరోజు ప్రమాణస్వీకారం చేసింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అమరావతి సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికలో మంత్రులతో ప్రమాణ స్వీకారం

Botsa Satyanarayana

Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రి వర్గం ఈరోజు ప్రమాణస్వీకారం చేసింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అమరావతి సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికలో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు అందరూ సీనియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డితో సహా.. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్లి  సీఎం జగన్ మోహన్ రెడ్డి   వద్దకు వెళ్లి ధన్యావాదాలు తెలిపారు. కొందరైతే జగన్ కు పాదాభివందనం కూడా చేశారు.

కానీ బొత్స సత్యానారాయణ మాత్రం నా రూటే సెపరేట్ ఉంటూ సీ ఎం జగన్ ను దాటుకుంటూ ముందుకు వెళ్ళి మొదట గవర్నర్ కు ధన్యావాదాలు తెలిపారు. అనంతరం సీఎం జగన్ వద్దకు వచ్చి ధన్యావాదాలు చెప్పారు.  మొత్తం ప్రమాణ స్వీకారోత్సవంలో కాళ్లకు దండం పెట్టిన వారు ఒక ఎత్తైతే…. మొదట సీఎం కు ధన్యావాదాలు చెప్పకుండా బొత్స హైలెట్ గా నిలిచారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ కీలకనేతగా వ్యవహరిస్తున్నారు. గత ముఖ్యమంత్రులు కే. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పనిచేశారు. ఉత్తరాంధ్రలో తిరుగులేనినేతగా బొత్స ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

Also Read : Peddireddy Ramachandra Reddy : అనుభవంలోనూ,వయస్సులోనూ పెద్దాయనే పెద్దిరెడ్డి