Peddireddy Ramachandra Reddy : అనుభవంలోనూ,వయస్సులోనూ పెద్దాయనే పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లాలో పెద్దాయనగా పేరు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  

Peddireddy Ramachandra Reddy : అనుభవంలోనూ,వయస్సులోనూ పెద్దాయనే పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy :  చిత్తూరు జిల్లాలో పెద్దాయనగా పేరు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎంఏ పీహెచ్ డీ చేసిన ఆయన 1974 లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్ధి సంఘ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నకయ్యారు. 1978 లో జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1985, 1994ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు.

కానీ 1989,1999,2004లలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. 2009 లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపోందారు. ఆ తర్వాత వైసీపీ లో చేరి 2014, 2019 లలో పుంగూనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, జగన్ కేబినెట్ లలో మంత్రిగా పని చేశారు.
Also Read : AP New Cabinet : ఏపీ నూతన మంత్రివర్గం.. ప్రమాణం చేసిన మంత్రులు వీరే…
పెద్దిరెడ్డికుమారుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీగాను, ఆయన సోదరుడు ద్వారకానాధరెడ్డి తంబళ్ళపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రిగా పని చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ధి,గనుల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.