పవన్‌ కల్యాణ్ కార్టూన్‌తో బాక్సింగ్‌.. జనసేన సీరియస్

భీమిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైట్ ఇచ్చారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Pawan Kalyan Cartoon Boxing

Pawan Kalyan Cartoon : భీమిలిలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్టూన్ పెట్టి బాక్సింగ్ చేయడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. సభ నిర్వాహకులపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైట్ ఇచ్చారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే. తొలుత భీమిలిలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. భీమిలి వేదికగా ఎన్నికల ప్రచారం చేశారు. కాగా, సిద్ధం సభలో నాలుగు కార్టూన్లు ఏర్పాటు చేశారు. అందులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ, కాంగ్రెస్.. ఈ నాలుగు ఫోటోలు ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ కార్టూన్ చూడగానే సభకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కార్టూన్ పై పిడిగుద్దులు కురిపిస్తూ బాక్సింగ్ చేశారు. దీనిపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. పవన్ కార్టూన్ పెట్టి అలా చేయడాన్ని వారు తప్పుపట్టారు. దీనిపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : అంతవరకు పుట్టింటి నుంచి కదలను.. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి..

ఇంతవరకు ఎక్కడా ఇలాంటి సంస్కృతి చూడలేదన్నారు. మొదటిసారి వైసీపీ శ్రేణులు ఈ సంస్కృతిని ఏర్పాటు చేశాయని మండిపడ్డారు. ఎన్నికలకు సిద్ధం అని చెబుతున్నారా? లేదా బాక్సింగ్ కు సిద్ధం అని చెబుతున్నారా? అని మండిపడ్డారు. దేనికైనా మేము కూడా రెడీ అంటూ జనసేన నాయకులు తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఎంతమంది ఆయనపై నిందలు వేసినా పవన్ కల్యాణ్ స్వచ్చంగానే ఉంటారని జనసేన ఫ్యాన్స్ చెప్పారు. అనకాపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ సభలో ఈ పంచ్ లకు సంబంధించి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేకపోగా కేవలం పథకాల గురించి చెప్పుకోవడం దారుణం అన్నారు.

Also Read : పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? ఈ 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం